రతిక రోజ్ తో సీరియల్ యాక్టర్ మానస్ చాటింగ్.. క్లారిటీ ఇచ్చిన హీరో మానస్..!!

బుల్లితెర స్టార్ నటుడుగా కొనసాగుతున్న మానస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. హౌస్ నుంచి పాజిటివ్ ఇమేజ్ తో బయటికి వచ్చాడు. కాగా ఈ నటుడి ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ ప్రస్తుతం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదిస్తున్నాయి. ప్రస్తుతం మానస్ స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు.

 

రీసెంట్ గా శ్రీజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇకపోతే మన బిగ్ బాస్ సీజన్ 7 లో పాటిస్పేట్ చేసిన రతిక గురించి ఎవరితోనో వాట్సప్ లో చాట్ చేశాడని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ నటుడు స్పందించి…” అది నా వాట్సప్ నెంబర్ కాదని ” క్లారిటీ ఇచ్చాడు. స్క్రీన్ షాట్ కూడా చూపించాడు.

 

ఇక రతిక విషయానికొస్తే బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన అందంతో , మాటలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. కొన్ని రోజులు పల్లవి ప్రశాంత్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఈమె బిహేవియర్ ఎవరికి నచ్చకపోవడంతో నాలుగో వారంలోని ఎలిమినేట్ చేసేసారు. మళ్లీ బిగ్ బాస్ 7 లోకి రీఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు. కానీ అది కంటెస్టెంట్లు చేతిలో ఉంది.