జెనీలియను ఇబ్బంది పెట్టిన తెలుగు డైరెక్టర్.. పేరుతో సహా బయటపెట్టేసిందిగా..!!

జెనీలియా .. ఈ పేరు కన్నా హ హ హాసిని అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు ఆమె అభిమానులు . బొమ్మరిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆడ్ అయిపోయిన జనీలియా .. ఆమె కెరియర్ లో ఇప్పటికీ బొమ్మరిల్లు సినిమా చాలా ప్రత్యేకమైనది అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది . ఈ సినిమా కోసం జెనీలియా చాలా చాలా కష్టపడింది .

దానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.  సిద్ధార్థ తో ఐస్క్రీమ్ తినే సీన్ కోసం డైరెక్టర్ ఆమెను అర్ధరాత్రి పూట షూట్ కి పిలిపించారట . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులు రాత్రి ఆ చిన్న సీన్ ని షూట్ చేశారట . దానికి కారణం జెనీలియా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వకపోవడం ..క్లైమేట్ సహకరించకపోవడం.

అయితే విసుగెత్తిపోయిన జెనీలియా నువ్వు వద్దు నీ సినిమా వద్దు అంటూ వెళ్ళిపోయిందట . రెండు రోజులు షూటింగ్ కి కూడా రాలేదట . ఆ తర్వాత  జెనీలియాకు ఎంతో క్లోజైనా బన్నీ మేటర్ లోకి ఇన్వాల్వ్ అయి కూల్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారట . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో జెనీలియా కెరీర్ ని ఎలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాలా..?