రూట్ మార్చిన నిహారిక.. ట్రెడిషనల్ లుక్ లో నీటిలో మునుగుతూ మెగా డాటర్ పుణ్య స్నానం..

మెగా డాటర్ నిహారిక జొన్న‌ల‌గడ్డ చైతన్యత విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంది. ఇక విడాకుల తర్వాత పంజరంలో నుంచి బయటపడిన పక్షుల స్వేచ్ఛగా విహరిస్తుంది. చాలా బోల్డుగా కనిపిస్తూ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ‌ని క‌విస్తుంది. ఎప్పుడు ఏదో విధంగా రచ్చ చేస్తుంది. వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తూ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోతుంది. మరోవైపు హాట్‌గాను మారుతుంది. గ్లామర్ షోలకు బోర్డర్ పెట్టుకోకుండా హాట్ నెస్ రోజు రోజుకు పెంచుతుంది. ఇటీవల ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ముందు ఒంటరిగా విదేశాలకు చెకేసింది.

ఇప్పుడు ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ దర్శనమిచ్చింది. జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తూ డివోషనల్ యాత్ర చేపట్టింది. దివ్యజ్ఞానం పొందే ప్రయత్నం చేస్తూ బ్రహ్మచారిని దేవత పూజలో బిజీగా ఉంది. తెల్ల చీర కట్టుకొని నీటి కొలనులో మునుగుతుంది. పుణ్యస్నానం ఆచరించి పూజలు నిర్వహించింది. అంతకుముందు సాధువులా షాక్ ఇచ్చిన నిహారిక ఉన్నటుండి ఇలా ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. తన కెరీర్ కోసం తన పర్సనల్ లైఫ్ కోసం ఆమె ఇలా పూజలు నిర్వహిస్తుందట. ఇక నిహారిక ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ జ్ఞాన స్వరూపిణి బ్రహ్మచారిని దేవిని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ వివరించింది.

ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మధ్య లో వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో కాషాయ రంగు దుస్తులో సాధువుల దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ బ్లౌజ్ లేకుండా కేవలం సారీ కట్టుకుని ఉదయాన సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ ఆకట్టుకుంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక దీంతోపాటే లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్‌లో పెళ్లి సందడి మొదలైంది. నవంబర్ లో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అయితే వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తుంది నిహారిక.