బిగ్ బాస్ బ్యూటీ అశ్విని నటించిన మహేష్ బాబు సినిమా ఏంటో తెలుసా..?

బిగ్‌బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఐదవ కంటెస్టెంట్‌గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇదివరకే పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అశ్వినికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అశ్విని చాలా సినిమాల్లో నటించినా మహేష్ బాబు సినిమాలో ఆమె చేసిన రోల్ తోనే కాస్త గుర్తింపు వచ్చిందంటూ న్యూస్ వినిపిస్తుంది.

ఈమె మహేష్ బాబు సినిమాలో కూడా నటించిందా అనుకుంటున్నారా.. అవును మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక రెండో అక్క పాత్రను పోషించింది. అశ్విని ట్రైన్ లో జరిగిన సీన్స్‌లో కీలక పాత్ర పోషిస్తూ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆక‌టుకుంది. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్విని సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

తరచు తన హాట్ ఫోటో షూట్ లు వీడియోలు షేర్ చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుని బిగ్‌బాస్ స్టార్టింగ్‌లో కాకుండా వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చినా తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తు హౌస్ లో కంటిన్యూ అవుతుంది.