నీహారిక చేస్తే తప్పు.. సితార చేస్తే ఒప్పా..? ఏకేస్తున్న ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీ లోకి స్టార్ హీరోస్ కూతుర్లు హీరోయిన్లుగా రావడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వనివ్వరు . ఆ లిస్టులోకే వస్తాడు మెగాస్టార్ చిరంజీవి . శ్రీజకు ఎంతో ఇష్టమైన సరే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనివ్వలేదు. కానీ నాగబాబు కూతురు నిహారిక మాత్రం ఇంట్లో ఒప్పించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

కానీ మెగా ఫాన్స్ ఆమెను హీరోయిన్గా యాక్సెప్ట్ చేయలేకపోయారు . ఈ క్రమంలోనే ఆమె ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది . అయితే రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చి సినిమాలు చేయాలని నిర్ణయించుకునింది . ఇదే విషయాన్ని అనఫిషియల్ గా కన్ఫర్మ్ చేసింది ఘట్టమనేని ఫ్యామిలీ . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతమైన చర్చ మొదలైంది .

నిహారిక హీరోయిన్ గా వస్తే మాత్రం తెగ ట్రోల్ చేసిన ఈ జనాలు సితార ఘట్టమనేని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వస్తే ఎలా ఎంకరేజ్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు . కొన్నిసార్లు సితార కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక హద్దులు మీరాల్సి ఉంటుందని .. అప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ విధంగానే సపోర్ట్ చేస్తారా..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!