అల్లు అర్జున్ కార్వాన్ డ్రైవర్ ఏడాది జీతం ఎంతో తెలుసా..?

ఈ రోజుల్లో ప్రతి స్టార్ హీరోకు కూడా ఎక్కువగా కార్వన్ ఉండనే ఉంటోంది. ఈ వాహనాన్ని ఎన్నో కోట్లు పెట్టి ఖర్చు చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో తమ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి చాలా అనుగుణంగా ఉండటమే కాకుండా ఎటువంటి ప్రదేశాలలో నైనా సరే ఉండే విధంగా కార్వన్ తయారు చేయించుకుంటూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్ కార్వన్ డ్రైవర్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఏడాది జీతాన్ని తెలియజేయడం జరిగింది.


లక్ష్మణ్ మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ గారి వీర అభిమానిని ఆయన స్టాఫ్ ను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఉంటారు.. ఒకసారి అలా వైకుంఠపురం సినిమా విడుదలైన సమయంలో మేము ఎవరు కూడా ఊహించని విధంగా ఆయన తమకు బోనస్ రూపంలో ఒక పెద్ద మొత్తంలో కానుకను ఇవ్వడం జరిగింది అంటూ తెలియజేశారు..కార్వన్ మైంటైన్ చేయాలి అంటే కచ్చితంగా ఒక ప్రత్యేకమైన శిక్షణ అవసరం ఉంటుంది.. అల్లు అర్జున్ గారు కార్వన్ తయారు చేయించుకుంటున్న సమయంలో తాను పూణేలో దాదాపుగా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారని తెలిపారు.

అల్లు అర్జున్ గారు తనకు నెలకి 2 లక్షలకు పైగా జీతం ఇస్తున్నారని తెలియజేశారు. లక్ష్మణ్ దీంతో దాదాపుగా ఏడాదికి బోనస్ అన్ని కలుపుకొని 15 లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లేవలో అన్ని భాషలలో తెరకెక్కిస్తూ విడుదల చేయాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.ఇతర హీరోలు కూడా తమ కార్వన్ డ్రైవర్లకు సైతం ఇంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా ఇస్తూ ఉన్నారు.