అభిమానులకు ఊహించని షాక్.. ఎన్టీఆర్ ఫోటోకి పూల దండ..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా దేవర . ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా కసితో తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీని . ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు . ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తుంది. రెండవ హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మను చూస్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది .

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దేవరకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ లీక్ అయి వైరల్ గా మారింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ దేవర అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ పాత్ర సినిమా మధ్యలో చనిపోతుంది.. అలా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాతే యంగ్ ఎన్టీఆర్ తెరపైకి కనిపిస్తాడు . అసలు యంగ్ ఎన్టీఆర్ కి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే దేవర ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి..? దేవర చనిపోవడానికి జాన్వి కపూర్ కి ఏంటి సంబంధం ..? అంటూ భారీ భారీ ట్విస్ట్ లతో కొరటాల శివ ఈసారి ఫుల్ రేంజ్ సస్పెన్స్ క్రియేట్ చేశారట.

అంతేకాదు ఈ సినిమాలో ఏకంగా ఎన్టీఆర్ ఫోటోకి పూలదండ వేసి కూడా మనకు చూపిస్తారట. అంతా బాగున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సీన్ ఒక్కటే ఇబ్బందికరంగా ఉండొచ్చు అంటున్నారు మేకర్స్ . అంతేకాదు ఫ్యాన్స్ తట్టుకోలేకపోతే కొరటాల ఫ్యాన్స్ కోపానికి బలి అవ్వాల్సిందే అంటూ కూడా హింట్ ఇస్తున్నారు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!