అప్పుడు చిరంజీవి చేస్తే తప్పు అన్నారు..? ఇప్పుడు బాలయ్య చేయగానే బెల్లం అయ్యిందా..?

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో కూసింత హద్దులు మీరిపోతున్నారు. మరి ముఖ్యంగా ఒక హీరో పై మరొక హీరో ఫ్యాన్స్ బూతులు తిట్టడం సర్వసాధారణమైపోయింది . ఈ మధ్యకాలంలో చిరంజీవిని కొందరు హీరోల ఫ్యాన్స్ ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూసాం . భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ ను చిరంజీవి హగ్ చేసుకోవడం పట్ల వ్యంగంగా ట్రోల్ చేశారు .

అయితే ఇప్పుడు అదే పొజిషన్లో బాలయ్య శ్రీలీల పై నాటి కామెంట్స్ చేస్తే మాత్రం ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . దీనిపై మెగా ఫాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. రీసెంట్గా భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ ” నేను హీరోగా శ్రీ లీల హీరోయిన్గా సినిమా చేద్దామనుకుంటున్నామని.. ఇదే విషయాన్ని మా ఇంట్లో వాళ్లకి చెప్తే కోప్పడ్డారని ..నా కొడుకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా .. నేను హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉంటే నా సినిమాలో కాకుండా నీ సినిమాలో ఎలా నటిస్తుంది..?” అంటూ కామెంట్ చేశాడు.

అయితే అప్పుడు కీర్తి సురేష్ విషయంలో చిరంజీవి చేసింది తప్పు అయితే ఇప్పుడు శ్రీలీల విషయంలో బాలకృష్ణ మాట్లాడిన పద్ధతి కూడా తప్పే . మరి ఆయనని తప్పు పట్టినప్పుడు ఇక్కడ ఈమెందుకు పోగొడుతున్నారు ..? అంటూ మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు..!!