టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తే.. అనిల్ రావుపూడి దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయుకుడి పాత్రను పోషించాడు.
దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అంతేకాదు కో ఆర్టిస్ట్ అయిన శ్రీలీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె అసలు బుద్ధి బయట పెట్టింది.
కాజల్ మాట్లాడుతూ.. `శ్రీలీల చాలా తెలివైన పిల్ల. ఎంతో కష్టపడుతుంది. తాను ఏం చేయాలనుకుంటుందో దానిపై ఓ స్పష్టతతో ఉంటుంది. ప్రతి పనిని ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది. పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. అలాగే సెటల్‌లో అందరితో సరదాగా కలిసిపోతుంది. ప్రతి ఒక్కరి పట్ల ఎంతో విధేయత చూపిస్తుంది. ఈతరం హీరోయిన్‌లకు ఇలాంటి లక్షణాలు ఉండాలి.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రీలీల గురించి కాజల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.