జాన్వీ కపూర్ కి నిద్ర రాకపోతే అలా చేస్తుందా..? ఈ పిల్ల మహా చిలిపి రా బాబోయ్..!!

చాలామందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి . కొందరికి నిద్ర రాకపోతే ఫోన్ చూడడం.. మరికొందరికి వాక్ చేయడం.. మరికొందరికి సరదాగా కబుర్లు చెప్పడం .. మరికొందరు మెడిటేషన్ చేయడం .. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది . అయితే మన అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ కి వెరీ వెరీ ఫన్నీ అలవాటు ఉంది . తనకు నిద్ర రాకపోతే రాత్రులు కచ్చితంగా ఫోన్ ఆన్ చేసి టామ్ అండ్ జెర్రీ వీడియోస్ చూస్తుందట .

ఏజ్ పెద్దదైన ఇంకా టామ్ అండ్ జెర్రీ వీడియోస్ చూడడం ఏంటో అనుకుంటున్నారా ..? ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం . జాన్వి కపూర్ కి మొదటి నుంచి టామ్ అండ్ జెర్రీ అంటే చాలా చాలా ఇష్టమట. ఆ కారణంగానే ఆమెకు అదే అడిక్ట్ అయిపోయిందట . జాన్వీ ఈ అలవాటును ఎంత మార్చుకుందాం అని ట్రై చేస్తున్న మార్చుకోలేకపోతుందట.

తనకి మూడ్ బాగో లేకపోయినా ..నిద్ర రాకపోయినా ..ముందు జాన్వి ఫోన్ ఆన్ చేసి టామ్ అండ్ జెర్రీ వీడియోస్ చూస్తుందట . అప్పుడు ఆమెకు మూడు సెట్ అయిపోతుందట . అంతేకాదు తను చెల్లి ఖుషి కపూర్ ని ఏడిపించడం అంటే మహా మహా ఇష్టమట.