100 కోట్ల పాన్ ఇండియా సినిమాని రిజెక్ట్ చేసిన తరుణ్.. ఎందుకో తెలుసా..?

టైం బాగోకపోతే.. ఎప్పుడు .. ఏం ..జరుగుతుందో..? ఎవరు గెస్ చేయలేం అంటూ ఉంటారు . మన ఇంట్లోని పెద్దవాళ్లు బహుశా తరుణ్ విషయంలో అదే జరిగినట్లు ఉంది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకొని లవర్ బాయ్ గా ట్యాగ్ చేయించుకున్న తరుణ్ ఎన్ని మంచి హిట్ సినిమాల్లో నటించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికి నువ్వే కావాలి , నువ్వు లేక నేను లేను సినిమాలు మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి ప్రత్యక్షంగా కారణం తరుణ్ నటన అని చెప్పుకోవాలి. అయితే అలాంటి హీరో వద్దకు ఓ డైరెక్టర్ వెళ్లి పాన్ ఇండియా కథను వినిపించగా కథలో హీరో రోల్ అయితేనే చేస్తాను ..వేరే క్యారెక్టర్ చేయను అంటూ తెగేసి చెప్పారట . అంతేకాదు ఆ హీరోకి తమ్ముడు పాత్రలో కనిపించమంటూ చాలా రిక్వెస్ట్ చేశారట .

అయినా సరే తరుణ్ ససేమీరా ఒప్పుకోలేదట. దీంతో ఆ పాత్ర వేరే హీరో చూస్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . అయితే తరుణ్ మాత్రం అలాంటి మంచి ఛాన్స్ మిస్ అయిపోయాడు . ఆ సినిమా ఏకంగా 100 కోట్లు క్రాస్ చేసింది . దీనితో మంచి ఛాన్స్ మిస్ అయిపోయాడు తరుణ్ అంటూ ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు.