ఫైనల్లీ..పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 2..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. కెరియర్ పరంగా సక్సెస్ కాలేకపోయినా సరే లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి అందాలు ముద్దుగుమ్మలు తాము ప్రేమించిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. స్టార్ హీరోలు కూడా అంతే .. కెరియర్ పరంగా హిట్ కొట్టిన కొట్టకపోయినా .. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు పెళ్లి చేసుకొని దాని తాలూకా గుడ్ న్యూస్ అభిమానులకు తెలియజేస్తున్నారు. కాగా త్వరలోనే అదే లిస్టులోకి యాడ్ అవబోతున్నారు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నెంబర్ 2 రామ్ పోతినేని అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా స్కంధ సినిమాతో యావరేజ్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రాం పోతినేని .. గత కొంతకాలంగా ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ . వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు తెర వెనక కూడా వీళ్ల ఫ్రెండ్షిప్ హద్దులు మీరి పోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్ కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అందరూ అది రాం పోతినేని అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . ఒకవేళ అన్ని సెట్ అయితే రామ్ పోతినేని ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకుని అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఫ్రెండ్స్..!!