ఒక్క సినిమాకే రూ.4కోట్లు తీసుకుంటున్న రష్మిక.. ఇప్పుడు ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే

ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఇండస్ట్రీ లోనే అత్యధిక రెమ్యూనయేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కన్నడ, తెలుగు సినిమా లతో రణించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళం, బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వరుస సినిమా లో బిజీ గా ఉంది. ఒకవైపు  పుష్ప 2 లో నటిస్తూ మరోవైపు యానిమల్ సినిమా లో కుడా నటిస్తుంది.

అయితే వరుస సినిమా లో నటించిన మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడికి ఇంస్టాగ్రామ్ లో 39.1 మిలియన్ల కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రష్మిక ఒకో సినిమా కి దాదాపు రూ. 4 కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటుంది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్స్ అడ్వర్టిస్మెంట్స్ కూడా చేస్తూ భారీగా సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆస్తులు విలువ $8 మిలియన్ USD అంటే మనం కారన్సీ లో రూ. 45 కోట్లు. నివేదికల ప్రస్తుతం రూ. 8 కోట్ల వార్షిక ఆదాయంతో నెలకు రూ. 60 లక్షల వరకూ సంపాదిస్తుంది.

ఇక ఈ అమ్మడికి బెంగళూరు లో రూ. 8 కోట్లు ఖరీధైన మాన్షన్ – కమ్ – విల్లా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్, ముంబై లలో సొంత ఇల్లు కూడా ఉన్నాయి. ఇక రష్మిక కి లక్సరి కార్స్ అంటే చాలా ఇష్టం. ఈమె దెగ్గర కోటి రూపాయల విలువ అయిన Mercedes Benz-c క్లాస్, 40 లక్షలు వీలువ అయిన Audi Q3 కార్లు ఉన్నాయి. అలానే లక్షలు విలువ చేసే హ్యాండబాగ్స్ ని వాడుతుంది. ఇక టాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా దుసుకుపోతుంది.