నిర్మాతగా సినిమాలలో త్రివిక్రమ్ వైఫ్ చేసే పని ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ డైరెక్టర్గా సక్సెస్ అయ్యి ప్రస్తుతం నిర్మాత పలు సినిమాలను తీయడం మొదలుపెట్టారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చే సినిమాలన్నిటినీ కూడా హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ని స్థాపించి చిన్న పెద్ద అనే హీరోలతో సినిమాలు వరుసగా చేస్తూ బిజీగా ఉన్నారు. నిర్మాతగా నాగవంశీ వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారి తన భార్య సౌజన్య పేరు మీద తన సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తూ ఉన్నారు. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కావడంతో సినీ నిర్మాతగా ఆమె కూడా పలు సినిమాలకు భాగమయ్యింది. అలా ధనుష్ నటించిన సార్ సినిమా సమయంలో కొన్నిసార్లు బయటికి వచ్చి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం జరిగింది. నిర్మాతగా సాయి సౌజన్య పేరు పడుతున్న ఈమె ఎక్కడ పెద్దగా కనిపించలేదు.

 

తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మమ్మల్ని త్రివిక్రమ్ గారే నిలబెట్టారు ఆయన గారి సినిమాలు కాకుండా వేరే సినిమాలు నిర్మించడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించారు త్రివిక్రమ్ గారు కొత్త వాళ్లకు టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ఫార్చునర్ ఫోర్ సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. త్రివిక్రమ్ గారి భార్య సాయి సౌజన్య గారు ప్రొడక్షన్లోకి రారు కదా ఓకే చేసే ముందు మా క్రియేటివ్ స్పేస్ లో కూర్చోవడం జరుగుతుంది. అక్కడే కథ విని ఏవైనా సజెషన్ ఉంటే చేస్తూ ఉంటుంది క్రియేటివ్ స్పేస్ తోని ఎక్కువగా డిస్కషన్ చేస్తుందని తెలిపారు నిర్మాత నాగవంశి.. నిర్మాతగా ఆమె పేరు వేసిన కథ స్క్రిప్ట్ వరకే చూస్తారని ప్రొడక్షన్ పనులు చూడరట.