తారక్ తో ” ఐరన్ మ్యాన్ ” లాంటి మూవీ.. యంగ్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..!!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా మూవీ ” దేవర ” చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి తన గత గ్లోబుల్ హిట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ గ్లోబుల్ ఫేమ్ తెచ్చుకోగా తను నెక్స్ట్ ఒక క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఇక ఈ భారీ లైనప్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా ఉంది.

ఇక త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ కి బాగా దగ్గరైన యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఎన్టీఆర్ పై చేసిన లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ…” తారక్ అన్నలో ఒక రకమైన కామెడీ టైమింగ్ ఉంటుంది.. అలాంటి దానితో ఒక సూపర్ హీరో సినిమా.. ఐరన్ మ్యాన్ లాంటి మూవీ చేయాలని ఉందని.. డెఫినెట్గా ఆ తరహా గ్రాండ్ సినిమాని చేస్తానని నాగవంశీ చెప్పుకొచ్చాడు”.

ప్రస్తుతం నాగ వంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఐరన్ మ్యాన్ లాంటి సినిమా ఏదైనా కామెడీ తరహాలో.. అది కూడా మా తారక్ అన్నతో తెరకెక్కిస్తే కచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరహాలో సినిమా తర్కెక్కించడానికి ఎంత టైం పడుతుందో వేచి చూడాలి.