పెళ్లి కాకముందే శ్రీదేవి తల్లి అయిందా.. అసలు నిజం ఇదే..?

వివాహానికి ముందే గర్భం దాల్చడం అనే విషయంలో బాలీవుడ్ నటీనటుల సైతం కాస్త ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆలియా భట్ కూడా అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు.. తాజాగా స్వర భాస్కర్ కూడా వివాహానికి ముందే గర్భం దాల్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే ఈ పద్ధతి ఇప్పుడే కాకుండా 1990 దశకంలో కూడా ఇలాంటి విషయాలు బయటకు రావడం జరుగుతూనే ఉన్నది.

Boney Kapoor reacts to claims of Janhvi Kapoor being born 'Out of Wedlock'  with Sridevi: "Spent a night there, had no choice but to..." - IBTimes India

ముఖ్యంగా అబ్బాయిల కలల రాణిగా పేరుపొందిన శ్రీదేవి సడన్గా బాలీవుడ్ నిర్మాత బోణి కపురును వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోని ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ వార్త అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. వివాహానికి ముందే శ్రీదేవి తల్లి అయిందంటూ కూడా చాలా వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. తాజాగా శ్రీదేవి నటి భర్త బోణి కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

తన రెండో వివాహం శ్రీదేవితో 1996 మే 2వ తేదీన షిరిడీలో జరిగిందని తెలిపారు. ఆ తరువాత మరుపట్టి సంవత్సరం జనవరిలో ఆమె గర్భం దాల్చింది దీంతో మా వివాహం దాచడానికి ఇక వేరే మార్గం లేకుండా పోయింది మా వివాహ విషయాన్ని జూన్ 2న ప్రకటించామని అందుకే కొంతమంది మా పెళ్ళికి ముందు శ్రీదేవి గర్భం దాల్చినట్లు వార్తలు వినిపించాయి.. జాన్వి మా పెళ్ళికి ముందే జన్మించింది అనే రూమర్లు కూడా వినిపించాయి అందులో నిజం లేదు మాకు మత విశ్వాసాల పైన చాలా నమ్మకం ఉన్నది.. అందుకే తన కుమార్తె కూడా ఎప్పుడు తిరుపతికి వెళుతూ ఉంటుంది నా భార్య శ్రీదేవి తన పుట్టినరోజుకు తిరుపతికి వచ్చేది మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె చెప్పులు లేకుండా కూడా వరసిద్ధి వినాయక వరకు కాలినడకన వచ్చేది అంటూ తెలిపారు.