ఆ మాట అనేసరికి..స్టేజీ పైనే ఏడ్చేసిన కలర్స్ స్వాతి..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కలర్స్ స్వాతి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ రూమర్ తో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . మరీ ముఖ్యంగా కలర్స్ స్వాతి నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన మంత్ అఫ్ మధు సినిమా అక్టోబర్ ఆరవ తేదీ గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫంక్షన్ లో నవీన్ చంద్ర మాట్లాడుతూ కలర్స్ స్వాతి పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు . “నాకు అక్క ఉందని .. తను జాబ్ కోసం ఆటో, బస్ , మెట్రోలో తిరగాల్సి వస్తుందని .. ఫ్యామిలీ కోసం చాలా చాలా కష్టపడుతుందని ..అదేవిధంగా కలర్స్ స్వాతి కూడా నా లైఫ్ లో నా ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటూ చెప్పుకొచ్చారు .”

అంతేకాదు ఆ దేవుడిని ఇంతకుమించి నేను ఇంకా ఏమీ అడగనని .. ఇలాంటి మంచి ఫ్రెండ్ ని ఇచ్చినందుకు చాలా చాలా ధ్యాంక్స్ అని ఆమెతో కలిసిన నటించే ఛాన్స్ వస్తే ఎప్పటికీ మిస్ చేసుకోను అని చెప్పుకొచ్చాడు . దీంతో పక్కనే ఉన్న కలర్స్ స్వాతి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గట్టిగా నవీన్ చంద్ర ని హగ్ చేసుకుంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!