పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు స్పందించడం లేదు అని.. జనసేన నేతలు కోర్టును ఆశ్రయించగా.. వారి వాదనలు విన్న న్యాయస్థానం.. పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Posani Krishna Murali contracts Covid for 3rd time, hospitalised in  Hyderabad: Report - India Today

కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం పోలీసులు పోసాని కృష్ణ మురళి పై.. IPC సెక్షన్ 354, 355, 500, 504 , 506, 5007, 5009 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే ఒకేసారి పోసాని కృష్ణమురళి పై ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ఆయన అభిమానులు పూర్తిస్థాయిలో వాగ్వాదానికి దిగుతున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు వైసిపి నాయకులు కూడా జనసేన నాయకులపై గుర్రుగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

 

ఇకపోతే పోసాని కృష్ణమురళి విషయానికి వస్తే.. మొదట్లో దర్శకుడుగా పనిచేసి ఎంతోమందిని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పెట్టుకొని వారికి దర్శకత్వంలో మెలకువలు నేర్పించి.. వారిని దర్శకులుగా మార్చారు. తర్వాత సినిమాలలో నటుడిగా నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇటీవల రాజకీయాలలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. వైసిపి మద్దతుదారుగా నిలిచిన కృష్ణ మురళికి పదవి కూడా లభించింది. ప్రస్తుతం ఈయనపై కేసు నమోదు చేయడంతో వైసిపి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.