అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమస్య మళ్ళీ పునరావృతమైనట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ లు, మరొకవైపు రాజకీయ ప్రచారాలు అంటూ బిజీగా ఉన్న ఈయన తాజాగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ జనవాణి కార్యక్రమంలో.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా.. క్లియర్ కాని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వస్తూ ఉంటారు ప్రజలు.. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువలా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడ్డారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా సరే వెన్నునొప్పి తగ్గకపోవడంతో ఆయన కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇకపోతే గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలోనే తన వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ తనను వెన్నునొప్పి బాధిస్తోందని 2019లో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

 

అప్పుడు ఎలక్షన్స్ సమయం కావడం వల్ల ప్రచార సమయంలో భాగంగా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు. దీంతో గాయాల నొప్పి తీవ్రత మరింత పెరిగిందని.. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కూడా సాంప్రదాయ వైద్యం పైనే నమ్మకం పెట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాను అని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ నడుము నొప్పి తీవ్రతరం అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.