బాహుబలి సినిమాకి ప్రభాస్ అలాంటి కండీషన్ పెట్టాడా..? ఏంటో తెలిస్తే నవ్వు ఆగదు..!!

బాహుబలి.. ఈ పేరు చెబుతూ ఉంటేనే మనకు తెలియకుండా ఏవో స్పెషల్ ఫీలింగ్స్ కలిగేస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా గూస్బంస్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ సినిమాని మనకు అందించాడు దర్శకధీరుడు రాజమౌళి . దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాహుబలి రాజమౌళి కెరియర్ లోనే ఫస్ట్ టైం రెండు భాగాలుగా తెరకెక్కింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ హిట్ అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది . ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం . అయితే ఈ సినిమాకి ప్రభాస్ క్రేజీ కండిషన్ పెట్టాడు రాజమౌళికి అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . ప్రభాస్ మంచి ఫుడీ.. ప్లేట్లో ముక్క లేనిదే ముద్ద తినడు .. అలాంటి ప్రభాస్ చేత ఫుల్ వెజిటేరియన్ డైట్ చేయించాడట జక్కన్న .

అది కూడా బాహుబలి వన్ కు ..మరింత కఠినంగా . దీంతో విసుగెత్తిపోయిన ప్రభాస్ నీతో బాహుబలి 2 చేయాలి అంటే కచ్చితంగా నా డైట్ ప్లాన్ చేంజ్ చేయాలి. నీతో సినిమా చేస్తున్నప్పుడు వరకే నేను డైట్ చేస్తాను .. మిగిలిన డేస్ లో నేను ఫుల్ గా తింటాను ..అలా ఓకే అయితే చేద్దాం .. లేదంటే నీతో పార్ట్ 2 చేయను అంటూ తెగేసి చెప్పేసారట . దీంతో నవ్వుకున్న జక్కన్న ప్రభాస్ కండిషన్ను ఓకే చేశాడట . ఆ తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే..!!