అప్పుడు విజయ్..ఇప్పుడు రష్మిక ..అదే స్ట్రాటజీను ఫాలో అవుతున్నారే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం . సినిమా కథ విషయం కంటెంట్ విషయం పక్కన పెడితే రొమాంటిక్ సీన్స్ హద్దులు చెరిపేసిన సీన్స్ బీప్ సౌండ్స్ ఉంటేనే సినిమా హిట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో సమంత విజయ్ దేవరకొండ ఏ రేంజ్ లో రెచ్చిపోయారో మనం చూసిందే . రీసెంట్ గా విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్నా సైతం అదే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది .

రష్మిక మందన్నా అనిమల్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ చేయబోతున్నాము అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డివంగా. కాగా ఈ పోస్టర్లో రన్బీర్ కపూర్ – రష్మిక మందన్నా ఘాటు అయిన లిప్ లాక్ తో మునిగి తేలిపోవడం అభిమానులకు షాకింగ్ అనిపించింది .

అర్జున్ రెడ్డి ని మించిపోయే రేంజ్ లోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు సందీప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా.. తమ సినిమాలో లిప్ లాక్ ఉంటే సినిమా హిట్ అవుతుందని అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!