బోయపాటి నెక్స్ట్ సినిమా కూడా ఫ్లాపే.. పోయి పోయి ఆ హీరోతో కమిట్ అయ్యాడు ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీను తాజాగా తెరకెక్కించిన సినిమా స్కంద. మల్టీ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ఈ సినిమాలో హీరోగా నటించాడు . అందాల ముద్దుగుమ్మ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాక్ పరంగా పర్లేదు అనిపించుకున్న కలెక్షన్స్ పరంగా నిల్ అయింది .

అంతేకాదు రామ్ కెరియర్ లో మరో ఫ్లాప్ ను ఈ సినిమా ఇచ్చినట్లయింది. కానీ జనాలకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది . ఈ సినిమాకి మెయిన్ డిసడ్వాంటేజ్ టూ మచ్ మాస్ నెస్ ఉండడమే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . కాగా స్కంద సినిమా తర్వాత బోయపాటి మరో ఫ్లాప్ తెలుగు హీరోని చూస్ చేసుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

బోయపాటి శ్రీను తన తర్వాతి సినిమాని నానితో తెరకెక్కించబోతున్నారట . ఇది కూడా ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాగా తెలుస్తుంది . నిజజీవితంలో జరిగిన స్టోరీనే తెరకెక్కించబోతున్నారట . అయితే బోయపాటి మాస్ కి నాని అస్సలు సెట్ అవ్వడు . దసరా సినిమా ఏదో హిట్ అయింది . కానీ ఫుల్ లెంత్ మాస్ రోల్ కి నాని న్యాయం చేయలేడు మరి అలాంటి హీరోతో సినిమా అంటే కచ్చితంగా నెక్స్ట్ కూడా ఫ్లాపే అంటున్నారు జనాలు..!!