ముద్దుల కొడుకుతో ఇలియానా క్యూట్ ఫోజ్.. విషయం ఏంటంటే..?

గోవా బ్యూటీ ఇలియానాకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ‘ దేవదాసు ‘ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నాజుకు నడుము సుందరిగా గుర్తింపు తెచ్చుకుంది. పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఇలియానా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న టైంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా బీ టౌన్‌లో సెటిల్ అవ్వాలని పాగా అక్కడకు మార్చింది. అయితే బాలీవుడ్ లో ఆమెకు ఊహించిన సక్సెస్ అందలేదుజ‌ తర్వాత లవ్ ఎఫైర్స్‌, బ్రేకప్స్ తో కుంగిపోయిన ఇలియానాకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి.

ఇక కొంతకాలం క్రితం తాను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసిన ఇలియానా అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండా అప్పుడే తల్లి అవడం ఏంటి.. ఇంతకీ తండ్రి ఎవరు.. అని అంశంపై చర్చలు తీవ్రంగా జరిగాయి. అయితే చాలా కాలం వరకు ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పనీ ఇలియానా ఇటీవల అతనికి ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటో ద్వారా అతని వివరాలు బయటకు వచ్చాయి. అతడి పేరు మైఖేల్ డోలన్ అని తెలుస్తుంది. ఇక ఆగస్టు 1వ తేదీన ఇలియానాకు పండంటి మగ బిడ్డ పుట్టాడు.

నిన్న ఈ బాబు పుట్టి రెండు నెలలు పూర్తి కావడంతో ఇలియానా తన బాబుతో క్యూట్ ఫాజులిస్తూ పిక్స్ దిగి ఆ పిక్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అప్పుడే బాబు కు రెండు నెలలు కంప్లీట్ అయ్యాయి అంటూ ట్యాగ్ చేసింది. ఇక ఆ బాబుకు కోవాపోనిక్స్ డోలన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలియానా తన కొడుకుతో దిగిన ఈ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇలియానా బాబు అచ్చం తల్లి పోలికలతోనే ఉన్నాడంటూ.. బలే క్యూట్‌గా ఉన్నాడు బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)