విగ్గు విషయంపై ఫైర్ అయిన బాలయ్య.. వీడియో వైరల్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా చాలామంది సీనియర్ నటులు సైతం ఎక్కువగా విగ్గును ఉపయోగిస్తూ ఉంటారు.. తాజాగా నందమూరి బాలకృష్ణ భగవంతు కేసరి సినిమా ఎమోషన్స్ లో భాగంగా విగ్గు గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మొన్న ఎవరో అన్నారు నా విగ్గు గురించి.. నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకు నువ్వు మీసాలకు పెట్టుంటావు కదా విగ్గు అని చురకలు అంటించారు..

అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. భగవంత్ కేసరి సినిమా చాలా హైప్ ఎనర్జీతో ఉంటుందని చెప్పవచ్చు. తనకు సరిపోయే కథలనే సైతం బాలయ్య ఎంచుకుంటున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు.. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. అయితే ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా హైప్ ని భారీగా పెంచేస్తోంది.

చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడు లేకుండా హిట్ అయిన సినిమానే పెద్ద సినిమా అని బాలయ్య తెలియజేస్తూ ఉంటారు.. తనకు తానే పోటీ అని తనకు ఎవరు పోటీ కాదని తన సినిమాలను సైతం థియేటర్లో చూడాలని తెలియజేస్తున్నాను ప్రస్తుత కాలంలో సంవత్సరాలు తరబడి సినిమాలు తీస్తూ ఉన్నారని శ్రీ లీల కూడా తెలుగమ్మాయి కావడం చాలా గర్వకారణంగా ఉందని తెలుపుతున్నారు. ఈనెల 19వ తేదీన దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.