రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనట..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సైతం అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను పుట్టడమే తల్లి ప్రేమకు అసలు నోచుకోలేదంటు తెలియజేసింది.

తన తండ్రికి కొడుకు పుడతారని చాలా ఆత్రుతగా ఎదురు చూశారని అయితే నేను పుట్టడంతో మూడు రోజుల పాటు తనని చూడడానికి కూడా ఇష్టపడలేదని తెలిపింది.. చాలామంది తల్లిదండ్రులు కూడా కొడుకు పుట్టలేదని ఆడపిల్లలను చంపేస్తూ ఉన్నారని అయితే నా తల్లితండ్రులు ఆ పని చేయలేదని తెలియజేసింది.. తన ఇంట్లో పని వాళ్ళ పెంపకంతో తన పెరిగానని ఎమోషనల్ అవ్వడం జరిగింది రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం ఇబ్బందికరంగానే మారిందని విడాకులు తీసుకోవడం చాలా బాధాకరంగా మారిందని తెలిపింది.

అయితే విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోలేదని విషయాన్ని తెలియజేస్తూ నాకు పెళ్లి అని కాన్సెప్ట్ చాలా ఇష్టమని అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మరొక వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్న తాను పెళ్లి చేసుకోలేదు.. నాలాంటి పరిస్థితి తన పిల్లలకు కూడా రాకూడదని ఉద్దేశంతోనే తాను నిశ్చితార్థం జరుపుకున్న పెళ్లి మాత్రం చేసుకోలేదని.. మరో రెండు మూడేళ్లలో తన పిల్లలు సెటిల్ అవుతారని అప్పుడు తప్పకుండా రెండో వివాహం చేసుకుంటానని తెలిపింది రేణు దేశాయ్.