ఎన్టీఆర్ సండే సీక్రెట్ చెప్పిన కళ్యాణ్ రామ్..!!

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇందులో కూడా ఎన్టీఆర్ చాలా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగిందట..ఎన్టీఆర్ వంట చాలా రుచిగా చేస్తారని అయితే ఎన్టీఆర్ మంచి కుక్ అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు అని తెలిపారు. బిగ్ బాస్ హౌస్లో కూడా గతంలో ఒకసారి కంటిస్టెంట్లకు మటన్ బిర్యానీ చేసి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రతి ఆదివారం చాలా వెరైటీ వంటకాలను చేస్తూ ఉంటారని తెలిపారు కళ్యాణ్ రామ్.. తన తమ్ముడి ఏదైనా ప్రస్టేషన్లో ఉన్నప్పుడు కూడా ఇలా కుక్ చేస్తారని ఇలా వంటలు చేయడం వల్ల ఆ ప్రెస్ స్టేషన్ అంతా తొలగిపోతుందని కళ్యాణ్ రామ్ తెలియజేయడం జరిగింది. అలా ఎన్టీఆర్ ఆదివారం ఖచ్చితంగా ఇంట్లో ఉంటే కనుక వంట బాధ్యత మొత్తం తానే చూసుకుంటారని కళ్యాణ్ రామ్ ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. అలాగే బింబిసారా సీక్వెల్ కూడ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.