శ్రీ హరి లాంటి నటుడు ఇక ఇండస్ట్రీలో రాలేరా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ అయిన పాత్రలలో కూడా నటించి మెప్పించారు.. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే రియల్ స్టార్ శ్రీహరి ఒక్క హెటర్ కూడా ఉండకపోవడం గమనార్హం. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం ఆయన ఎంతోమందికి సహాయం చేశారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. శ్రీహరి మనసు ఎంత సున్నితమైనదో ఈ విషయం ఉదాహరణగా చెప్పవచ్చు.

శ్రీహరి కాలేయ సంబంధిత సమస్యతో కొన్ని సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది.. అక్షర ఫౌండేషన్ ద్వారా శ్రీహరి ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారట. దాదాపుగా 100 సినిమాలలో నటించిన శ్రీహరి మెజారిటీ సినిమాలతో అనుకూలమైన ఫలితాలను సైతం అందుకున్నారు. శ్రీహరి కొడుకు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. శ్రీహరి మరణించిన తన కుటుంబానికి ఎలాంటి కష్టం రాకూడదని చాలా జాగ్రత్త పడ్డారట.

శ్రీహరి జీవించి ఉన్న సమయంలో రెమ్యూనరేషన్ విషయంలో చాలామంది నిర్మాతల సైతం అతని ఇబ్బంది పెట్టారట. శ్రీహరి అభిమానులు మాత్రం శ్రీహరి కుమారులకు అవకాశాలు ఇస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు. శ్రీహరి మంచితనం గురించి ఎంతో చెప్పినా తక్కువే శ్రీహరి కుటుంబానికి దర్శక నిర్మాతలు సైతం అవకాశాలు ఇప్పించి వారిని బయటపడేలా చేయాలని కోరుకుంటున్నారు. అయితే శ్రీహరి లాంటి నటుడు మాత్రం ఇండస్ట్రీలో ఇకమీదట రాలేరని కూడా చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.