పుష్ప సినిమా పై నాని సెన్సేషనల్ కామెంట్స్..

నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్‌ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్ రిలీజింగ్ ఈవెంట్లో పాల్గొన్న నాని మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇదివరకు మీరు దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు కానీ ఆ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.

మళ్లీ ఇప్పుడు హాయ్ నాన్న పాన్ ఇండియా లెవెల్‌లోనే తెరకెక్కించడానికి కారణం ఏంటి..? అని అడగగా నాని మాట్లాడుతూ నేను పాన్ ఇండియా మౌవీనా మామూలు సినిమానా అని చూడను కథ నచ్చితే చేసేస్తా. నేను చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకులు కూడా దాదాపు ఆదరించారు. సో నేను పాన్ ఇండియా సినిమానా.. కాదా.. అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం కధ‌ మాత్రమే చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. మీరు నటించిన జెస్సీ సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మీ నటనకు అవార్డు రాలేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి..? అని అడగగా నాని మాట్లాడుతూ బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.

ఆర్ఆర్‌ఆర్ సినిమాకు కూడా రావడం చాలా సంతోషంగా అనిపించింది. నేషనల్ అవార్డు కోసం పుష్ప, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు చేయలేదు. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి చేసిన సినిమాలు. అందుకే వాటికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అని చెప్పుకొచ్చారు. ఇక శౌర్యవ్‌ డైరెక్షన్లో మోహన్ చెరుకూరి, విజయేంద్ర రెడ్డి తీగల ప్రొడక్షన్ లో హాయ్ నాన్న‌ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బేబీ కియారా కీలక పాత్రలో నటిస్తుంది. దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఈ సినిమాతో అయినా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అందుకోవాలని నాని భావిస్తున్నారు. నాని అనుకున్న రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.