టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ కూడ లవ్ ఫెయిల్యూర్..!!

రవితేజ.. హీరోగా టైగర్ నాగేశ్వరరావు గా నటించిన సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కాబోతోంది. అభిషేక అగర్వాల్ పతాకం పైన డైరెక్టర్ వంశీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్స్.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు.. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళి శర్మ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నుపుర్ సనన్ హీరోయిన్ కృతిసనన్ సొంత చెల్లిలని చాలా తక్కువ మందికి తెలుసు. సూపర్ మోడల్ గా పలు సినిమాలకు ప్రైవేట్ ఆల్బమ్లతో గుర్తింపు సంపాదించుకున్న రవితేజ సరసన ఈమె టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తన లవ్ బ్రేకప్ గురించి తెలిపింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నుపుర్ సనన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరినైనా ప్రేమించారా అని అడగక కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను చాలా సిన్సియర్గా ప్రేమించాను కానీ అతడు తనని మోసం చేస్తున్నారని అర్థమయ్యేలోపు చాలా లోతులో మునిగిపోయాను అతన్ని గుడ్డిగా నమ్మి లవ్ ఫెయిల్యూర్ అయ్యానని ఏడ్చేసానని చాలా బాధపడ్డాను ఇంట్లో వాళ్లకి ఎక్కడ తెలుస్తుందో అంటూ రాత్రిపూట బాత్రూంలో వెళ్లి మరి ఏడ్చాను ఆ బాధ నుంచి బయట పడడానికి చాలానే సమయం పట్టిందని తెలిపింది నుపుర్ సనన్.