మన తెలుగు హీరోలు అంత పిరికివాళ్ల..? చంద్రబాబు అరెస్ట్ పై ఒక్కరు నోరు విప్పకపోవడానికి రీజన్ అదేనా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు . ప్రజెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇండియా వైడ్ ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. ప్రెసెంట్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు . ఇదే మూమెంట్లో టిడిపి శ్రేణులు ఆయన అరెస్టుపై టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడం పై మండిపడుతున్నారు .

నిజానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలతో మంచి రాపో ఉంది . చంద్రబాబునాయుడుని ఇష్టపడే స్టార్ హీరోలు కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే మాత్రం టాలీవుడ్ హీరోలు అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం ఆయన అరెస్టయ్యారు ..ఇది అన్యాయం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం లేదు . దానికి కారణం భయం అంటూ చెప్పుకొస్తున్నారు టీడీపీ ఫ్యాన్స్.

ఎక్కడ చంద్రబాబునాయుడుకు సపోర్ట్ చేస్తే అధికార పార్టీ తమతప్పులను బయటపెడుతుందో అని భయపడుతున్నారని ..అందుకే ఎవరు ఈ ఇష్యూ పై స్పందించడం లేదని టిడిపి శ్రేణులు ..తెలుగు హీరోలపై మండిపడుతున్నారు. మరి కొంతమంది ఏకంగా వీళ్ళు పిరికివాళ్లని .. ఇలాంటి వాళ్ల వల్ల దేశానికి ఏం ప్రయోజనం లేదని దారుణంగా కమాండ్స్ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాజకీయాలలోనే కాకుండా సినిమా ఇండస్ట్రిలో కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!