Infront There is a crocodile festival: జైల్లో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న చంద్రబాబు..ఈసారి దెబ్బ మామూలుగా ఉండదురోయ్..!!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే . కాగా గత మూడు రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్తలు మనకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. కాగ చంద్ర బాబు ని రాజమండ్రిలోని రాజమహేంద్రవరం జైలుకి తరలించారు ఆఫీసర్లు .

ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తూ పలు మీమ్‌స్ ను ట్రెండ్ చేస్తున్నారు . కాగా చంద్రబాబు నాయుడును పొగుడుతూ కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ ..చంద్రబాబు నాయుడుని పొగుడుతూ అధికార పార్టీ నేతలపై మండిపడుతున్నారు . బాహుబలి లోని సినిమా డైలాగును రీ క్రియేట్ చేస్తూ..” జైల్లో కూర్చొని ఊచల లెక్కపెట్టడానికి చంద్రబాబు ఏమన్నా తెలివి లేనివాడా..? త్వరలోనే తన కొడుకు రాబోతున్నాడు.. వచ్చాక అందరికి రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తాడు.. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేస్తున్నాడని.. ఈసారి దీపావళి పండుగ కూసింత త్వరగానే రాబోతుందని .. దెబ్బకి దిమ్మతిరిగి పోవాలని కౌంటర్స్ వేస్తూ మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు “.

అంతేకాదు ఈసారి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఎక్స్పీరియన్స్ మొత్తం కలగలిపి.. చాలా భారీ స్థాయిలోనే దెబ్బ కొట్టబోతున్నాడు అని .. రిటర్న్ గిఫ్ట్ కి ఇవ్వడానికి రెడి అవుతున్నాడని.. ముందుంది ముసలి పండగా అంటూ టిడిపి ఫ్యాన్స్ స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!