ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఫ్యాన్స్ కూడా అస్సలు గెస్ చేయలేరు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా తమకంటూ కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి . పలానా పాత్రలో నటించాలి అని.. అలాంటి రోల్ ద్వారా అభిమానులకి మరింత చేరువ అవ్వాలి అని .. ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు . అలాగే మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఆశ పడుతూ ఉంటారు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ఓ రోల్ చేయాలని కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారట .

కానీ ఇప్పటివరకు అలాంటి రోల్ ఆయనకు వచ్చిందే లేదు . ఆ రోల్ మరి ఏంటో కాదు శ్రీకృష్ణుడు . ఎస్ ఎన్టీఆర్ కి శ్రీకృష్ణుడు పాత్ర చేయాలని ఎప్పటినుంచో కోరికగా ఉందట. తన తాతగారిని కృష్ణుడు పాత్రలో చూశాక ఒక్కసారైనా ఆయన కృష్ణుడి గెటప్ లో కనిపించాలి అని ఆశ పడ్డారట. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆయనకు ఇప్పటివరకు అలాంటి అవకాశం రాకపోవడం గమనార్హం .

బృందావణం సినిమాలో అలా కనిపించిన అది ఫుల్ లెంత్ రోల్ కాదు. అలా మెరిసి ఇలా మాయం అయిపోతాడు. చాలా సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో గెటప్స్ లో కనిపించిన ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు గెటప్ లో నటించి మెప్పించాలని ఆశపడుతున్నారు . డైరెక్టర్స్ అలాంటి కథను ఆయన వద్దకు తీసుకువస్తే బాగుంటుంది అంటూ కూడా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి తారక్ డ్రీమ్ రోల్ ఫుల్ ఫిల్ చేసే డైరెక్టర్ ఎక్కడున్నాడో..?