బన్నీ పై కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసిన బేబి నటుడు.. నాశనమైపోయా అంటూ ఎమోషనల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుంది .. ఏ సినిమా ఫట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు .. సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి ..ఆ కోవాలకే వస్తుంది బేబీ సినిమా . ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది . పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ లాభాలు తీసుకొచ్చి.. సినీ ఇండస్ట్రీలో చెరగని రికార్డును క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా ద్వారా నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విరాజ్ అశ్విన్ తాజాగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

గతంలో అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన షేడ్ లోనే తాను డాన్స్ నేర్చుకోవడానికి వెళ్లానని.. అక్కడ డాన్స్ మాస్టర్ అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా చెప్పారని .. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని ..హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు అంటూ విరాజ్ అశ్విన్ బేబీ సక్సెస్ సినిమా సెలబ్రేషన్స్ లో భాగంగా స్టేజిపై చెప్పుకొచ్చారు. అయితే ఇదే వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి .

 

కేవలం హార్డ్ వర్క్ ఉంటే సరిపోదు.. మనం ఏం కావాలి అనుకుంటున్నామో దానికి తగ్గ టాలెంట్ మనలో ఉండాలి .. అనే విధంగా అల్లు అర్జున్ కామెంట్ చేయడంతో చాలామంది ఆయనను ట్రోల్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు విరాజ్ యాక్షన్ కి అల్లు అర్జున్ రియాక్షన్ అంటూ పలువురు కామెంట్ చేసి నన్ను విపరీతంగా ట్రోల్ చేసి నా మనోభావాలు దెబ్బ తినేలా చేశారు అని చెప్పుకొచ్చారు . దీంతో విరాజ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!