” సలార్ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్.. స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌..!!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. హోంభ‌ళె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు వహిస్తున్నారు. అలాగే రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రారంభం నాటి నుంచి అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పరిచిన సలార్ టీజర్… ఇటీవల రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంది. ఇక సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్నాళ్లపాటు వాయిదా వేశారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్ ప్రకారం… ఈ మూవీపై కమర్షియల్ గా మరింత హైప్ తీసుకువచ్చేందుకు ఒక స్పెషల్ సాంగ్ ని జత చేయాలని టీం ఆలోచన చేస్తుందట.

ఇక ఈ సాంగ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన త్రిష లేదా ఐశ్వర్య రామ్ నటించే ఛాన్స్ ఉందని టాక్. ఇక తాజాగా తన మోకాళ్ళ సర్జరీ తరువాత మెల్లగా కోలుకుంటున్నా ప్రభాస్… పూర్తిగా కోల్కున్న తరువాత ఈ సాంగ్ చిత్రీకరణ మొదలుపెట్టనున్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.