స్టార్ హీరో పై రివేంజ్ తీర్చుకుంటున్న శ్రీలీల.. టైం చూసి కొట్టిన కన్నడ పిల్ల..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలతో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శ్రీ లీల ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో పై రివెంజ్ తీర్చుకుంటుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు ..సినీ విశ్లేషకులు . ఏ స్టార్ హీరో సినిమాకు అయినా సరే ఆలోచించకుండా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చే శ్రీలీల..

ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరో తో సినిమా అవకాశం వస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసిందట . కాల్ షీట్స్ ఉన్నా సరే కాల్ షీట్స్ లేవు అంటూ సున్నితంగా ఈ ఆఫర్ ని చేసినట్లు తెలుస్తుంది. దానికి కారణం గతంలో పెళ్లి సందడి సినిమా తర్వాత ఆ స్టార్ సీనియర్ హీరోతోనే ఈమె నటించాల్సి ఉన్నింది. ఆయన సినిమాలో ఓ రోల్లో శ్రీలీల సెలెక్ట్ అయింది .

అయితే శ్రీ లీల పర్ఫామెన్స్ బాగోలేదు అని ..ఆ హీరో శ్రీ లీల చిన్న పిల్లలా ఉంది అంటూ రిజెక్ట్ చేశారట. దీంతో శ్రీ లీల చాలా డీప్ గా హర్ట్ అయిందని.. ఇప్పుడు ఆ రివేంజ్ ఈ విధంగా తీర్చుకుంటుందని అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల పేరు మారుమ్రోగిపోతుంది..!!