ఫ్యాన్స్ కి ఆ ముచ్చట కూడా తీర్చేయనున్న శ్రీలీల.. ఇక రచ్చ రంబోలానే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకొని జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే చేతిలో పదికి పైగా ప్రాజెక్టులు పట్టుకొని ఉన్న ఈ ముద్దుగుమ్మ వరుసగా ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి .

ఇలాంటి క్రమంలోని శ్రీ లీల కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . శ్రీలీల త్వరలోనే ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది అన్న ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో ఊపందుకుంది .ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్గా మెప్పించిన శ్రీలీల త్వరలోనే స్టార్ సినిమాలో హాట్ ఐటమ్ గర్ల్ గా కనిపించబోతుంది అని..

శ్రీ లీల ఏ పాత్రనైనా ఎలాంటి సాంగ్స్ లో నైన అవలీలగా నటించగలరు అంటూ ప్రూవ్ చేయడానికి శ్రీ లీల ఈ నిర్ణయం తీసుకుంది అంటూ తెలుస్తుంది . ఒకవేళ అది జరిగితే నిజంగా శ్రీ లీల అభిమానులకు ఆ ముచ్చట కూడా తీర్చేయబోతుందని చెప్పాలి. చూడాలి మరి ఈ బ్యూటీ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పుతుందో..?