ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిన రానా.. ఆ సినిమా ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి కాంబోలు సెట్ అయితే చూడాలి అన్నది అభిమానుల కోరిక . ఆలిస్టులో బోలెడు మంది స్టార్ హీరోలు ఉన్నారు . అయితే ప్రధానంగా అందరూ తారక్ – రానా దగ్గుబాటి కలిసిన నటిస్తే చూడాలి అంటూ ఆశపడుతున్నారు. మరీ ముఖ్యంగా బాహుబలిలో ప్రభాస్ – రానా దగ్గుబాటి కలిసి నటించిన తర్వాత రానా దగ్గుబాటితో నటించాలని చాలామంది హీరోలు కోరుకుంటున్నారు.

వాళ్ళల్లో ఒకరే తారక్ . అయితే అలాంటి అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశాడు రానా దగ్గుబాటి . దానికి కారణం కధ నచ్చకపోవడం. రానా దగ్గుబాటి – తారక్ కాంబినేషన్ల మిస్ అయిన సినిమా జై లవకుశ . ఈ సినిమాలో డైరెక్టర్ ముందుగా ముగ్గురు పాత్రలకు డిఫరెంట్ డిఫరెంట్ హీరోస్ ని చూస్ చేసుకున్నారట . మహేష్ బాబు – ఎన్టీఆర్ – రానా దగ్గుబాటి . ఎస్ఈ పాత్రలో ఈ ముగ్గురు నటిస్తే చాలా సక్సెస్ అవుతుంది అంటూ డైరెక్టర్ భావించారట.

అయితే మహేష్ బాబు – రానా దగ్గుబాటి తమ పాత్రలను సున్నితంగా రిజెక్ట్ చేశారట . అంతేకాదు ముగ్గురు హీరోలు కలిసి నటించాలంటే ఆ సినిమాలో గ్రిప్ ఉండాలి.. ఈ సినిమాలో ఆ పస లేదు అంటూ రానా దగ్గుబాటి సున్నితంగానే ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట . అలా ఈ ముగ్గురు రోల్స్ ను తారక్కే పోషించి సంచలనానికి తెరలేపారు. కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయినా టాక్ పరంగా నటన పరంగా సినిమా మంచి టాక్ ని అందుకుంది..!!