సాయి పల్లవి ఫ్యాన్స్ కి తీపి కబురు.. త్వరలోనే ఇంట్లో పెళ్లి..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో ఎలా సెటిలైపోతున్నారో మనం చూసిందే. కాగ ఇప్పటికే టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ – మలయాళం ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు అందరు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసి మ్యారీడ్ లైఫ్ కు వెల్కం చేస్తున్నారు . అంతేకాదు త్వరగా ప్రెగ్నెన్సీ న్యూస్లను కూడా కన్ఫామ్ చేస్తూ అభిమానులకి ఢబుల్ గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు .

తాజాగా ఇండస్ట్రీలో మరో బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . ఆమె మరి ఎవరో కాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి చెల్లెలు పూజా కనన్. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ మీడియాలో వైరల్ అవుతుంది. పూజా కనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట . ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయినట్టు కూడా ప్రచారం జరుగుతుంది . అంతేకాదు పూజా కనన్ ని పెళ్లి చేసుకోబోయేది తన సొంత బావని అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి .

ఇది పూర్తిగా పెద్దలు కుదిరించిన వివాహం అని .. త్వరలోనే వీళ్ల వెడ్డింగ్ డేటు అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సాయి పల్లవి చెల్లి పూజ కనన్ పేరు మరోసారి నెట్టింట మారుమ్రోగిపోతుంది. పూజకనన్ కూడా సినిమాలో నటించింది.. కానీ సాయి పల్లవి అంత క్రేజ్ దక్కించుకోలేకపోయింది..!!