స్టార్ హీరోలకు షాక్..ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..!!

టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా పలు రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.. కొన్ని నెలల వ్యవధిలోని ఎన్నో బ్రాండ్స్ కు సైతం సంబంధించిన యాడ్సులలో నటిస్తూ వార్తలుగా నిలుస్తూ ఉన్నారు ఎన్టీఆర్.. ఇప్పుడు తాజాగా మరొక బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. గ్రీన్ ఫ్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంబంధించి ఎమీషన్ జీరో.. అనే ప్రోడక్ట్ కోసం ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Greenply Industries partners with Jr. NTR to promote zero emission product  range in new campaign - MediaBrief

ఫ్లై ఫుడ్ కు సంబంధించిన ఈ యడ్స్ లో ఎన్టీఆర్ నటించడంతో రాబోయే రోజుల్లో ఈ బ్రాండ్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఏర్పడుతుందని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు.. ఎన్టీఆర్ కేవలం ప్రజలకు మేలు చేసేటువంటి ఉత్పత్తులను మాత్రమే ఎంచుకొని వాటిని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు తన సినిమాలో లైనప్ చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా పైన అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దేవర సినిమా మాస్ సినిమాగా ఉండబోతున్నట్లు ఈ సినిమా పోస్టర్లను చూస్తే మనకు అర్థమవుతుంది.. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు.