ఆ క్రికెటర్ ని వివాహం చేసుకోబోతున్న పూజ హెగ్డే.. నిజమేనా..?

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే మొదట నాగచైతన్య తో కలిసి నటించిన చిత్రం ఒక లైలా కోసం. ఈ సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ముకుందా సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ వెంటనే అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం.. ఎన్టీఆర్ తో అరవింద సమేత.. మహర్షి ,అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి క్రేజీతోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఈమె స్టార్ హీరోల సరసన కూడా బాలీవుడ్లో నటించిన సక్సెస్ కాలేకపోయింది.

ఇక తెలుగులో గుంటూరు కారం సినిమా నుంచి కొన్ని కారణాల చేత తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా పూజా హెగ్డే కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై కి చెందిన ఒక ప్రముఖ క్రికెటర్ తో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

అయితే పూజా హెగ్డే అభిమానులు మాత్రం ఈ అమ్మడుని ఇష్టపడిన ఆ క్రికెటర్ ఎవరా అంటూ తెగ ఆరా తీస్తున్నారు అయితే ఈ విషయంపై పూజా హెగ్డే ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవలే ముంబైలో సేవ మండల్ సందర్శించిన ఈమె అక్కడ గణేష్ ని దర్శించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆ పూజలో పాల్గొన్నట్లు సమాచారం సాంప్రదాయమైన దుస్తులలో వెళ్ళిన పూజా హెగ్డే అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ పెళ్లి విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.