అలాంటి వ్యాధితో బాధపడుతున్న నటి వనిత విజయ్ కుమార్..!!

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం ఏదో ఒక జబ్బు బారిన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో హీరోయిన్ సమంత మయోసైటీస్ బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అలాగే హీరోయిన్ ప్రియా బాజ్ పెయ్, నటి కల్పిక గణేష్ సైతం ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిలాగే తాను కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేస్తోంది నటి వనిత విజయ్ కుమార్.

తాజగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి కాస్ట్రోఫోబియాతో సతమతమవుతున్నట్లుగా తెలియజేసింది. దీని వల్ల చిన్నచిన్న ప్రదేశాలలో ఎక్కువసేపు ఉంటే తనకి చాలా భయంగా అనిపిస్తుందని తెలుపుతోంది. ముఖ్యంగా వాష్ రూమ్, లిఫ్ట్ తదితర చిన్న ప్రదేశాలలో ఉండాలంటే చాలా భయమేస్తుందట.. గాలి ఆడని ప్రదేశాలలో జనాలు లేని చోట ఉండాలి అంటే చాలా భయంగా అనిపిస్తుందట. గతంలో సంపూర్ణేష్ బాబు సైతం బిగ్ బాస్ షోలో ఇలాంటి భావనతో ఇబ్బంది పడడం జరిగింది.

ఇకపోతే తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వనిత విజయ్ కుమార్ ఆ తరువాత పలు చిత్రాలలో బుల్లితెరపై కూడా పరిశీలించలు నటించింది. ఈమె కూతురు జోవిక సైతం త్వరలోనే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చే విధంగా పలు రకాల ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ముంబైలోని అనుపమ్ కేర్ యాక్టింగ్ స్కూల్లో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. గడచిన కొద్ది రోజుల క్రితం అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సైతం వనిత విజయ్ కుమార్ షేర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఇమే త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు.