“సిగ్గుంటే మరోసారి ఆ పని చేయను”..ఆ విషయంలో నయనతారకు అంత కోపం వచ్చిందా..?

సాధారణంగా మనల్ని ఎవరైనా పాయింట్ అవుట్ చేసిన ట్రోల్ చేసిన విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కేవలం సామాన్య పీపుల్స్ కే కాదు స్టార్స్ సెలబ్రిటీస్ కి అలాంటి కోపం వస్తుంది . మరీ ముఖ్యంగా నయనతారకు ముక్కు మీద కోపం .. ఎవరైనా ఒక్క మాట అంటే చాలు వెంటనే ఇచ్చి పడేస్తుంది. అయితే కోపంలో ఆ మాటలు అనేసినా మరోసారి అలాంటి తప్పే మళ్ళీ చేస్తూ వస్తుంది .

గతంలో నయనతార ఇక నేను ఎక్స్పోజింగ్ చేయను.. అలాంటి డ్రెస్సెస్ వేసుకొను అంటూ ఎన్నోసార్లు మండిపడినా.. ఆఖరికి మళ్ళీ అలాంటి తప్పే చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో నయనతార గజినీ సినిమాలో టూ హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. అంతేకాదు అప్పట్లో బొద్దుగా ఉన్న నయనతారను ఆ సినిమాలో చూసి చడ్డీలు మీడ్డీలు వేయొద్దు తల్లో అంటూ నయనతారను వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు కొందరు ఆకతాయిలు .

అయితే అప్పట్లోనే నయనతార వీటిపై ఫైర్ అవుతూ ఇంకొకసారి నేను అలాంటి సీన్స్ చేయనని .. అలాంటి డ్రెస్సెస్ వేయను అని ఫ్రెండ్స్ వద్ద భారీ స్దాయిలోనే శపధాలు చెప్పుకొచ్చిందట. అయితే ఏం లాభం మళ్లీ ఆ కోపం చల్లారగానే నయనతార అలాంటి ఎన్నో చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అయింది . ప్రజెంట్ కూడా అలాంటి ఓ ట్రోలింగ్ కే గురవుతుంది . జవాన్ సినిమాలో నయనతార నటించినందుకు ఆమె ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుందట. అట్లీ కావాలని ఆమెను ఇన్సల్ట్ చేసాడని ..క్రెడిట్ మొత్తం దీపికా పదుకొణేకు తీసుకెళ్లిపోయారని .. ఇక ఆయన దర్శకత్వంలో నటించను అంటే నటించను అంటూ తెగ్గేసి చెప్పెసిందట..!!