విజ‌య్ ‘ లియో ‘ కు రిలీజ్‌కు ముందే పెద్ద దెబ్బ ప‌డిపోయింది… !

కోలీవుడ్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్గా దర్శకుడు లోకేష్ కనకరాజు రూపొందించిన సాలిడ్ మూవీ లియో. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ రేంజ్ లో ఓవర్సీస్ బిజినెస్ జరపడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

 

ఇప్పటికే వచ్చిన పాన్ ఇండియా లెవెల్ మూవీస్ మించి మరింత సీరియ‌స్‌గా ఈ సినిమా విజయ్ నటించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఎలాగైనా లియో సినిమాతో బాలీవుడ్ లో రాణించాలనే విజయ్ కల నెరవేరుతుంది అనుకునే సందర్భంలో బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్ర‌ప్ నటించిన గణపధ్ మూవీ రేస్ లోకి దిగింది.

దీంతో ఎలాగైనా లియో సినిమాతో బాలీవుడ్ లో మంచి ముద్ర వేసుకోవాలని అనుకున్న విజయ్ కల‌ మళ్లీ నెరవేరేలా కనిపించడం లేదు. లియోకు గ‌ణ‌ప‌ధ్ మూవీ గట్టి కాంపిటీషన్ అనే చెప్పాలి. దీనితో మళ్ళీ విజ‌య్‌ సినిమాకి బీటౌన్‌లో మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కష్టమే అని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.