సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఆ స్టార్ హీరోనే కారణమా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి సినిమా హిట్ త‌న ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత వరుస సూపర్ హిట్ సినిమాలలో న‌టించింది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నిజజీవితంలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది.

మొదటి అక్కినేని నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న సమంత తరువాత మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడింది. అయితే ఈమె ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు టాలీవుడ్ బడా ఫ్యామిలీలో సంబంధించిన ఓ స్టార్ హీరో హెల్ప్ చేశాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్, సమంత మొదటి నుంచి మంచి స్నేహితులు అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా సమంతతో చాలా క్లోజ్ గా ఉంటుంది. ఇక ఉపాసన అపోలో హాస్పిటల్స్ సీఈవో అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత డాక్టర్స్ మొత్తం ఆమెకు తెలుసు. సమంతకు మయోసైటిస్ వ్యాధి ఉందని తెలిసిన తరువాత ఉపాసననే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ని సజెస్ట్ చేసిందట‌. చెర్రీ ఉపాస‌న ఆమె హెల్త్‌పై కేర్ తీసుకున్నార‌ట‌. ఆ కారణంగానే సమంత తొందరగా మయోసైటీస్ నుంచి కోలుకుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సమంత ప్రస్తుతం అమెరికాలో మ‌యోసైటీస్‌ చివరి దశ ట్రీట్మెంట్ తీసుకుంటుంది.