బన్నీ తన హీరోయిన్స్ విషయంలో మెయిన్ గా కాన్సెంట్రేషన్ చేసేది అదే..అందుకే సినిమాలు అలా తగలాడుతాయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ దక్కించుకున్న ఎంతోమంది హీరోలు ప్రెసెంట్ ఇండస్ట్రీలో వంద నుంచి 150 కోట్లు పారితోషకం అందుకుంటూ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు బన్నీ . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ రీసెంట్గా పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వరించింది.

దీంతో సోషల్ మీడియాలో గ్లోబల్ స్థాయిలో ఓవర్ నైట్ లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు బన్నీ . ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. కాగా బన్నీ తన సినిమాల విషయంలో కొత్త కొత్త హీరోయిన్స్ ని తీసుకొస్తూనే ఉంటారు. ట్రాక్ రికార్డు లేకపోయినా సరే అందం టాలెంట్ ఉంటే బన్నీ కచ్చితంగా తన సినిమాల అవకాశమిస్తారు . ఇప్పటికే ఆయన సినిమాలో చాలామంది హీరోయిన్స్ ని అలా సెలెక్ట్ చేసుకుని సక్సెస్ అయ్యారు.

అయితే బన్నీ ముఖ్యంగా తన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకునే ఓ విషయంలో పర్టికలర్గా ఆలోచిస్తారట. అదే ఎక్స్ప్రెషన్స్.. బన్నీకి ఎక్స్ప్రెషన్స్ అవలీలగా పలికించే హీరోయిన్స్ అంటే చాలా చాలా నచ్చుతుందట. అంతేకాదు హీరోయిన్స్ తో వర్క్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వగలగాలి అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు. సిగ్గుతో ..మొహమాటంతో .. బిడియం తో మొక్కుబడిగా యాక్టింగ్ చేస్తే తెరపై నటన బాగా రాదని ..బన్నీ నమ్ముతూ ఉంటారట . అందుకే హీరోయిన్స్ లో ఆ షైనస్ లేకుండా ఉండే హీరోయిన్స్ చేసుకుంటారట . అయితే కొన్ని సినిమాల విషయంలో మాత్రం బన్నీ లెక్కలు తప్పాయి ..అందుకే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోయాయి..!!