బాలీవుడ్‌కి కీర్తి సురేష్.. ఫస్ట్ సినిమా లవర్ బాయ్‌తో..!!

మహానటి కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాది స్టార్ నటీమణులంతా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కాగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో పాటు కెరీర్‌లో మరింత ఎదగడానికి హిందీ సినిమాలే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ‘ జవాన్ ‘ తో నయనతార బీట్‌ను ఏంట్రీ ఇచ్చి అద్భుత విజయం అందుకోగా సమంత కూడా వెబ్సిరీస్‌ల‌తో రాణిస్తుంది. ఈ నేపథ్యంలో స్టార్ నటి కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్‌ధావన్ హీరోయిన్‌గా రాబోతున్న తదుపరి సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తి నటించబోతున్నట్లు సమాచారం.

keerthy suresh latest hot

అంతేకాదు పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు దర్శకుడు అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడని.. త్వరలోనే మూవీ షూటింగ్లో కీర్తి జాయిన్ కాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తుంది.