దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి.. రానా త‌మ్ముడి వివాహానికి ప్లేస్ & డేట్ ఫిక్స్‌!?

ద‌గ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లు కాబోతోంది. నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడు, రానా త‌మ్ముడు, యంగ్ హీరో అభిరామ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. దివంగత రామానాయుడు తమ్ముడు మనవరాలితో అభిరామ్ వివాహం జ‌రుగ‌బోతోంది. మ‌ర‌ద‌లితోనే ఆయ‌న ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. వ‌ధువు ఫ్యామిలీ ప్రస్తుతం కారంచేడులో నివశిస్తోందని తెలుస్తోంది.

అమ్మాయి గురించి పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఆమె మాస్ కమ్యూనిక‌ష‌న్ చేసింద‌ని అంటున్నారు. అలాగే స‌ద‌రు అమ్మాయితో అభిరామ్ చిన్న‌త‌నం నుంచి స‌న్నిహితంగా ఉండేవాడ‌ట‌. వీరిది ల‌వ్ క‌మ్ అరేంజ్ మ్యారేజ్ తెలుస్తోంది. తాజాగా ఇరు కుటుంబ‌స‌భ్యులు వెడ్డింగ్ ప్లేస్ మ‌రియు డేట్ ను ఫిక్స్ చేశారు. అభిరామ్ వివాహం డిసెంబ‌ర్ 6న అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది.

అయితే పెళ్లి మాత్రం ఇండియాలో జ‌ర‌గ‌డం లేదు. శ్రీ‌లంక‌లో అభిరామ్ డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు ప్రారంభం అయ్యాయ‌ట‌. అలాగే వెడ్డింగ్ కార్డ్స్ ను చాలా స్పెష‌ల్ గా డిజైన్ చేయిస్తున్నార‌ట‌. పెళ్లి కార్డులో కారంచేడులోని రామానాయుడిగారి పాత ఇంటిని అచ్చుగా వేయించబోతున్నారట. త్వ‌ర‌లోనే అభిరామ్ పెళ్లిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని అంటున్నారు. కాగా, శ్రీ‌రెడ్డి లైగింక ఆరోప‌ణ‌ల‌తో 2018లో వార్త‌ల్లో హాట్ టాపిక్ అయిన అభిరామ్‌.. ఇటీవ‌లె `అహింస‌` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.