దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే వధువు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్..!!

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలి అంటే టాలెంట్ తో పాటు లక్ కూడా భారీగా కలిసి రావాలి.. అలా బ్యాక్ గ్రౌండ్ ఉండి లక్ లేక సక్సెస్ కాలేని హీరోలలో హీరో అభిరామ్ కూడా ఒకరు.. కెరియర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఫెయిల్యూర్ హీరోగా మిగిలిపోయారు.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాలో లుక్స్ విషయంలో నటన విషయంలో దగ్గుబాటి అభిరామ్ పలు విమర్శలను ఎదుర్కొన్నారు.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల వ్యాపారాల పైన దృష్టి పెడుతూ ఉండేవారట అభిరామ్..

Abhiram Daggubati Biography, Age, Family & Movies - MixIndia

తాజగ ఇండస్ట్రీలో అభిరామ్ పెళ్లి తేది ఫిక్స్ అయ్యిందని ఈ ఏడాది శ్రీలంకలో అభిరామ్ పెళ్లి చాలా గ్రాండ్గా జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం దగ్గుబాటి అభిమానులను సంతోషపరిచేలా ఉందని చెప్పవచ్చు.. సురేష్ బాబు చెల్లెలి కూతురితో అభిరామ్ జీవితాన్ని పంచుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వధువు కుటుంబానికి కూడా వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. వధువు కుటుంబం కారం చేడులో నివసిస్తున్నట్లు సమాచారం.

ఇక పెళ్లికూతురు ఉన్నత చదువులు చదివిందని ఈ పెళ్లితో రామానాయుడు కోరిక కూడా తీరబోతుందని తెలుస్తున్నది.. వధువు కుటుంబానికి పొలాలతో పాటు పలు రకాల వ్యాపారాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన వీరు పెళ్లి చాలా గ్రాండ్గా జరగబోతుందని సమాచారం. రామానాయుడు నివసించిన పాత ఇల్లు డిజైన్ శుభలేఖ పై అచ్చు వేయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..అభిరామ్ కు కూడా ఆ అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్నట్లు సమాచారం. మరి పెళ్లి తర్వాత ఆయన అభిరామ్ కెరియర్ మారుతుందేమో చూడాలి మరి.