త్రిషతో లిప్ లాక్ అంటే నో చెప్పిన టాప్ హీరో..!!

సౌత్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు.. కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 96 అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇటీవలే పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత ఆకట్టుకుంది త్రిష. త్రిష విజయ్ సేతుపతి కలిసి నటించిన 96 చిత్రం బెస్ట్ రొమాంటిక్ చిత్రంగా పేరు పొందింది. ఆ తర్వాత పలు భాషలలో కూడా ఈ సినిమాని రీమేక్ చేయడం జరిగింది.

Vijay Sethupathi and Trisha's 96 to be remade in Hindi

96 చిత్రంలో త్రిష విజయ్ సేతుపతి.. రామ్ – జాను అనే పేర్లతో బాగా ఆకట్టుకున్నారు. తమిళంలో విడుదలైన ఈ చిత్రం వీరిద్దరి పాత్రలను ఇప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రేక్షకులను ఎమోషనల్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు వీడ్కోలు పలికేలా ఉండడంతోపాటు ఎయిర్పోర్టులో వచ్చే సన్నివేశాన్ని పరిశీలిస్తే త్రిష విజయ్ సేతుపతి ముద్దు సీన్ లేకుండా కనిపించారు.. అయితే అందుకు బదులుగా వారు తమ ముఖాలపై చేతులు ఉంచడం జరుగుతుంది.

కానీ స్క్రిప్ట్ ప్రకారం అలా లేదట విజయ్ సేతుపతి త్రిష మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశం చేయవలసి ఉండగా అందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిందట. కానీ విజయ్ సేతుపతి మాత్రం అలా నటించడానికి ఒప్పుకోలేదట.. ఎందుకంటే విజయ్ సేతుపతి తన సినిమాలలో ముద్దు సన్నివేశాలు చేయడు ఇదే విషయాన్ని డైరెక్టర్ల ముందే తెలియజేస్తూ ఉంటారు.. అయితే విజయ్ సేతుపతిలాగే అజిత్, సూర్య శివ కార్తికేయన్ వంటి నటీనటులు కూడా లిప్ లాక్ సన్నివేశాలు చేయడానికి నిరాకరించారని చెప్పవచ్చు. ప్రస్తుతం త్రిష విజయ్తో కలిసి లియో సినిమాలో నటిస్తోంది.