“నువ్వు అలా చేస్తే నేను చచ్చిపోతా”..చిరంజీవినే బ్లాక్ మెయిల్ చేసిన రామ్ చరణ్..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తున్నాం.. వింటున్నాం . మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అన్న వార్తలు వినపడితే చాలు ఎక్కువ మంది డిస్ లైక్ కొడుతున్నారు . దానికి కారణం నిహారిక – శ్రీజ బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకున్న కారణంగానే అన్న విషయం అందరికీ తెలిసిందే .

కాగా గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చిరంజీవిని ఎదిరించాడు రామ్ చరణ్ అన్న వార్త వైరల్ గా మారింది . నిజానికి చిరంజీవి – చరణ్ కోసం చాలా చాలా కష్టపడ్డాడట . ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ గా ఉండాలి అంటూ శ్రీహరి వద్దకు ఫిట్నెస్ కోసం పంపించారట. అయితే కరెక్ట్ గా రెండు అంటే రెండు రోజులు వెళ్ళిన రాంచరణ్ ఆయన దెబ్బకు నేను వేగలేను అంటూ చేతులెత్తేసి ఆయన దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతాను.. అంత కఠినంగా చేపిస్తున్నాడు అంటూ ఏడ్చేసాడట.

అంతేకాదు నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళను అంటూ మొండి చేశారట. ఈ విషయం అప్పట్లో వైరల్ గా మారింది. అంతేకాదు శ్రీహరి నిజంగానే చాలా కఠినంగా రూల్స్ ఫాలో అవుతాడు . ఫిట్నెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందుకే ఆయనను అందరూ ఫిట్నెస్ రాక్షసుడు అంటూ కూడా పిలుస్తూ ఉంటారు . కాగా ఆ తర్వాత చరణ్ – శ్రీహరి మగధీర సినిమాలో కలిసి నటించి మెప్పించారు . ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే..!!